Chandrababu Attend State Level Sarpanches Conference: ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్‌ల ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. స్థానిక సుపరిపాలన, ఆత్మ గౌరవం ,ఆత్మ విశ్వాసం నినాదంతో పంచాయతీలకు ఆయన ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారు. స్థానిక సంస్థల గౌరవాన్ని జగన్ తగ్గించేశాడని మండిపడిన చంద్రబాబు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్‌లకు ఉన్న అన్ని అధికారాలను తిరిగి అప్పగిస్తామని స్పష్టం చేశారు. గౌరవ వేతనాలు సైతం పెంచుతామన్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచ్‌లే కీలక భూమిక పోషించేలా ప్రత్యక చర్యలు చేపడతామన్నారు.
హాజరైన సర్పంచ్‌లు సస్పెండ్: ఆర్థిక సంఘం నిధులను జగన్ దారిమళ్లించారని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు చేరేలా చూస్తామన్న ఆయన ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి బడ్జెట్‌లో 5 శాతం నిధులు పంచాయతీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్‌ల రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన అధికారపార్టీ సర్పంచ్‌లు ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు హాజరైన పలువురు వైఎస్సార్సీపీ సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ నుంచి వారి ఫోన్లకు ఎస్ఎంఎస్లు వచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు తామే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తెలుగుదేశంలో చేరారు.
కేంద్రమంత్రికి నిరసన సెగ - క్షమాపణ చెప్పాలంటూ సర్పంచ్‌ల నినాదాలు
ప్రజా స్వామ్యంలో స్థానిక పాలన గౌరవాన్ని జగన్ తగ్గించేశాడని దుయ్యబట్టారు. పంచాయతీల వ్యవస్థ ఎదుగుదలను జగన్ ఎక్కడికక్కడ నరికేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, విధులకు సంబంధించి సర్పంచ్‌లకు సర్వ అధికారాలు కల్పించేలా 73, 74 రాజ్యాంగ సవరణ లు అమలు చేసి తీరుతామని చంద్రబాబు తేల్చిచెప్పారు. గ్రామంలో ఏ పని జరగాలన్నా సర్పంచ్, పంచాయతీ ఆధ్వర్యంలో జరిగేలా కార్యక్రమాలు రూపొందిస్తామని వివరించారు. తమకు సేవ చేసేందుకు ప్రజలు సర్పంచ్ లను ఎన్నుకుంటే, తన సేవ కోసం జగన్ వాలంటీర్లను నియమించాడని ధ్వజమెత్తారు.
పంచాయతీలకు శాపంగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు - నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించాలన్న సర్పంచులు
రుషికొండను బోడిగుండు చేసి 500 కోట్లతో భవనం: రాజధాని అమరావతిలో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే సంపద సృష్టి జరిగేదని చంద్రబాబు తెలిపారు. అమరావతే రాజధానని ముందు మెప్పించి ఇల్లు కట్టుకున్నామని చెప్పి ఆ తరువాత మూడు రాజధానులు ఉంటే నష్టం ఏమిటని చివరకు జగన్ విశాఖకు మకాం మార్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుషికొండను బోడిగుండు చేసి 500 కోట్లతో భవనం కట్టుకున్నారని దుయ్యబట్టారు. వెళ్లిపోతాను అనడానికి జగన్‌కు అధికారం ఎక్కడ ఉందని కోర్టులు స్పష్టంగా చెప్పాయని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు కూడా ఏప్రిల్ తరువాత చూసుకో అని చెప్పిందని ఏప్రిల్ నాటికి జగన్ మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి పోతారో తెలియదని ఎద్దేవా చేశారు. అమరావతి ఇక్కడే ఉంటుందని తేల్చిచెప్పారు. ఒక వ్యక్తి చర్యలతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలు తెలుసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.