ETV Bharat / state

సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ.. వైసీపీ ప్రజలను మభ్యపెడుతోంది: చంద్రబాబు - Chandrababu accuses YSRCP

Chandrababu accuses YSRCP: తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ, మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితామని ఆక్షేపించారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

చంద్రబాబు
Chandrababu
author img

By

Published : Dec 10, 2022, 6:04 PM IST

Chandrababu on Samaikya Andhra Pradesh: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆందోళనకలిగిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అలాంటి ఘటనలపై దృష్టి పెట్టకుండా మళ్ళీ సమైక్య రాష్ట్రం అంటూ ప్రభుత్వం ప్రకటనలేంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చెప్పాలంటే రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో ప్రజలు నిరాశానిస్పృహలతో ఉంటే, వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టడం లేదన్నారు. తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు.

ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ, మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితామని ఆక్షేపించారు. ప్రభుత్వ పెద్దలు ముందు ఆ తప్పులను సరిదిద్దుకోవాలని హితవుపలికారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలకు కారణాలు విశ్లేషించాలని కోరారు. వ్యవసాయరంగ వృద్ధిలో, ఆక్వా ఎగుమతుల్లో నాడు రికార్డులు సృష్టించిన రాష్ట్రం, ఇప్పుడు మూడేళ్లలో 1673 రైతు ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్ గా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

  • ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి... రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలకు కారణాలు విశ్లేషించాలి. సత్వర స్పందనతో ప్రణాళిక అమలుపరిచి అన్నదాతలకు అండగా నిలవాలి.(5/5)

    — N Chandrababu Naidu (@ncbn) December 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు రైతులను అప్పులపాలు చేస్తున్నాయని వాపోయారు. మద్దతు ధర లేకపోవడం, వ్యవసాయ సబ్సిడీలు నిలిచిపోవడం వంటివి అన్నదాతల బలవన్మరణాలకు కారణం అవుతున్నాయన్నారు. మరోవైపు ప్రభుత్వ టెర్రరిజం తీరుతో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. నిస్పృహకు గురైన సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారని, సత్వర స్పందనతో ప్రణాళిక అమలుపరిచి అన్నదాతలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.