రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ప్రస్తుతం జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకు వైకాపా వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. ఆన్లైన్ ద్వారా మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు అమరావతికి మద్దతుగా మాట్లాడిన వైకాపా నేతలు... ఇప్పుడు నమ్మక ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ పోరాటం తన కోసం కాదని... భవిష్యత్తు తరాల కోసమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వైకాపా నేతలు ఏం చెప్పారో.. ఇప్పుడు ఏం చెబుతున్నారో చూడండి అంటూ 'మాట తప్పారు... మడమ తిప్పారు' పేరిట వీడియోను చంద్రబాబు విడుదల చేశారు.
ఇదీ చదవండి