తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. రైతు విజయ్ కుమారుడు.. చైతన్య వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించారు. చంద్రబాబు రాకను గమనించిన బంధుమిత్రులంతా జై అమరావతి.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
బాబు చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చంద్రబాబుకు స్వాగతం పలికారు. రైతుల నినాదాలతో బాబు కారు దిగి వారికి అభివాదం చేశారు.
ఇదీ చూడండి:
రియల్ లైఫ్లో 'ఉప్పెన సీన్'.. ఆమెను ప్రేమించాడని మర్మాంగాన్ని కోసేసి..