ETV Bharat / state

Chain Snatcher Arrested: చైన్ స్నాచర్​ని కటకటాల్లోకి పంపిన పోలీసులు - చైన్ స్నాచర్​ని కటకటాల్లోకి పంపిన పోలీసులు

Chain Snatcher Arrested In Nallapadu : అతడు ఇంటర్మీడియట్ నుంచి జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అవసరమైనప్పుడు చైన్ స్నాచింగ్ చేస్తూ పూట గడుపుతుండేవాడు. గతంలో ఓ సారి జైలుకు వచ్చిన తన ప్రవృతి మార్చుకోలేక పోయాడు. తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 25, 2023, 1:49 PM IST

బంగారు చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు

Chain Snatcher Arrested In Nallapadu : జల్సాలకు అలవాటు పడి మహిళల మెడల్లో బంగారు గొలుసులు దొంగతనం చేస్తున్న యువకుడు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్​లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను సీఐ బత్తుల శ్రీనివాసరావు తెలిపారు.

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాధాల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కొంతకాలంగా తెనాలిలో ఉంటున్నాడు. నరసరావుపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే మద్యం, సిగిరెట్ తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడ్డాడు. దొంగిలించిన వాహనాలను అమ్ముతున్న క్రమంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. కొంతకాలం తరువాత జైలు నుంచి బయటకు వచ్చాడు. తరువాత కుటుంబ సభ్యులు అతన్ని తెనాలిలో బంధువుల వద్ద ఉంచారు. అక్కడే ఉండి కూలి పనులకు వెళ్తుడేవాడు.

వ్యసనాలకు బానిసైన అతనికి డబ్బులు అవసరమైనప్పుడు జిల్లాలోని పలు చోట్ల మహిళల మెడల్లో గొలుసులు అపహరించాడు. ఈ ఏడాది జనవరిలో వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన చిమిటిగంట ఆరుణ కుమారి ఏటుకూరు రోడ్డులో వెళ్తుండగా వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కొని ఎవ్వరికి దొరకకుండా పరారయ్యాడు. బాధితురాలు నల్లపాడు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న యువకులపై నిఘా ఉంచారు. వెంకటేశ్వర్లును అనుమానితుడిగా గుర్తించారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు, విజయవాడ, తాడికొండ తదితర ప్రాంతాల్లో బంగారు గొలుసులు, ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడినట్లు వారు గుర్తించారు. ఆటో నగర్ సమీపంలోని వైజంక్షన్ వద్ద వెంకటేశ్వర్లును వలపన్ని అరెస్టు చేశారు.

నిందితుడి నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనంను పోలీసులు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఎస్ఐ అశోక్, సిబ్బంది సుబ్బారావు, వెంకట నారాయణ, పోతురాజు, జాన్ సైదా, తదితరులు పాల్గొన్నారు.

" అరుణ కుమారి అనే మహిళ గొలుసును దొంగలించిన వేంకటేశ్వర్లును వైజంక్షన్ వద్ద అరెస్టు చేశాము. ఇతను మూడు బైక్​లు దొంగతనం చేశాడు. వాటిని రికవరీ చేయడం జరిగింది. " - బత్తుల శ్రీనివాసరావు, సీఐ

పట్ట పగలు చైన్ స్నాచింగ్ చేసిన ఆగంతకులు : ఎన్​టీఆర్ జిల్లా తిరువూరు రూరల్ మండలం జి కొత్తూరులో పట్ట పగలు చైన్ స్నాచింగ్ జరిగింది. మంచి నీళ్లు ఇవ్వమని అడిగి అనంతరం మహిళ మెడలోని బంగారు గొలుసును ఆగంతకులు దొంగలించారు. అప్పటికే స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న బైక్​పై నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను పోలీసులు సేకరించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.