కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య నిపుణుల బృందం గుంటూరు జిల్లా తెనాలి జిల్లా వైద్యశాలని పరిశీలించింది. జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ సనత్ కుమారితో సమావేశమై కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై బృంద సభ్యులు సమీక్షించారు. కోవిడ్-19 జిల్లా ఆస్పత్రిగా తెనాలి వైద్యశాలను ఏర్పాటు చేయడం చికిత్స నిమిత్తం వస్తున్న రోగుల లక్షణాలను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై చర్చించారు. అనంతరం చికిత్స తీరుకు సంబంధించి కేంద్ర వైద్య నిపుణులు సిబ్బందికి కీలక సూచనలు చేశారు.
ఇవీ చూడండి...