ETV Bharat / state

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

author img

By

Published : Dec 24, 2022, 10:04 PM IST

Updated : Dec 25, 2022, 6:38 AM IST

Christmas Wishes Chandrababu and Pawan: ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న క్రీస్తు ఆరాధకులందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు
Chandrababu

Christmas Wishes: క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరీసోదరమణులకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న క్రీస్తు ఆరాధకులందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ అన్నది మానవ లక్షణం అని, సాటి మనిషి పట్ల ప్రేమను, కనికరాన్ని కలిగి ఉండాలని క్రీస్తు మనకు బోధించారన్నారు. లోకానికి నిస్వార్థ సేవామార్గాన్ని సూచించిన శాంతి ప్రదాత క్రీస్తు అని పేర్కొన్నారు. తనకు కీడు తలపెట్టిన స్వార్థపరులను సైతం క్షమించగలిగాడు కాబట్టే జనం ఆయన్ను దైవకుమారుడిగా భావించి ప్రార్థిస్తున్నారని వెల్లడించారు. సమాజం కోసం జీవితాన్ని, చివరికి ప్రాణాలు సైతం అర్పించిన త్యాగమూర్తి క్రీస్తు మార్గం సర్వజనులకు ఆచరణీయమన్నారు. ఆయన చూపిన మార్గంలో పేదల పట్ల కరుణ కలిగి ఉందామని సూచించారు. కరుణామయుడైన ఏసు దీవెనలు మీ ఇంటిల్లిపాదికీ లభించాలని.. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని ప్రశాంతతను పంచాలని కోరుకుంటున్నా అన్నారు.

త్యాగం.. శాంతి.. ప్రేమ సందేశాలు: లోకభాంధవుడుగా కీర్తిగాంచిన ఏసుక్రీస్తు అవతరించిన పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ జరుపుకొంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పశువులపాకలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవించి ప్రపంచానికి త్యాగం.. శాంతి.. ప్రేమ సందేశాలను ఆచరణాత్మకంగా అందించిన ఆ ప్రభువు పలుకులు సర్వదా ఆచరణీయమన్నారు. 'ఈర్ష్యాద్వేషాలు, కుట్రలు కుతంత్రాలు, ద్రోహ చింతన విడనాడాలి' అన్న క్రీస్తు వ్యాక్యము శ్రేయోదాయకమన్నారు. అబద్దం, లంచం, లోభానికి పాల్పడనివారే నిజమైన క్రీస్తు భక్తులు అని చెప్పిన బైబిల్ సారాన్ని విశ్వసిస్తామన్నారు. ఈ ఆనందపు వేళ ప్రజలందరికీ అంతులేని ఆనందాన్ని, సంపదను ప్రసాదించాలని ఏసు క్రీస్తును ప్రార్ధిస్తునన్నారు.

అందరిలో దేవుడు: లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా క్రిస్మస్‌ మహోత్సవంగా జరుపుకుంటున్న ఆనందకర సందర్భంలో క్రిస్టియన్‌ సోదర, సోదరీమణులకు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మానవులలో ప్రేమ, కరుణ, శాంతి వెల్లి విరియాలని ఆ గుణాలు ఉన్నప్పుడే మనిషి పరిశుద్ధుడు అవతాడని ఏసుక్రీస్తు బోధించారన్నారు. ఏసుక్రీస్తు మానవాళి అభివృద్ధికి శాంతి ఎంతో ముఖ్యమని చెప్పారున్నారు. అందుకే ఆయనను 'ప్రిన్స్‌ ఆఫ్‌ పీస్‌' అంటారు. అందరిలో దేవుడున్నాడని, ఎవరినీ బాధించరాదని పేదలను ప్రేమించి ఆదుకోవాలని... రోగులను, బాధితులను సందర్శించి వారిని ధైర్యపరచాలని చెప్పారన్నారు.

క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు: క‌రుణామ‌యుడి పుట్టిన‌రోజు..క్రైస్త‌వులంద‌రికీ పండుగ రోజు, ద‌యామయుడి శాంతి సందేశాన్ని ప్ర‌జ‌ల‌కు అందించే పాస్ట‌ర్ల‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్వీటర్ వేదికగా తెలిపారు.

  • పాస్ట‌ర్లకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్‌, నూత‌న వ‌స్త్రాలతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌లు స్థానిక టిడిపి నేతలు అంద‌జేశారు.(2/2)#christmas2022 pic.twitter.com/JDGHCoJsuH

    — Lokesh Nara (@naralokesh) December 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

Last Updated : Dec 25, 2022, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.