Celebrities Bakrid Wishes: రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకొన్నారు. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో ముస్లింలకు పలువురు రాజకీయ ప్రముఖులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీకైన బక్రీద్‌ను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ శుభాకాంక్షలు:
గవర్నర్ అబ్దుల్ నజీర్.. ముస్లింలకు బక్రిద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ అనేది త్యాగం సర్వ శక్తిమంతుని పట్ల సంపూర్ణ భక్తి, పేదల పట్ల కరుణను చాటుతుందన్నారు.
-
"On the solemn occasion of Bakrid (Id-ul-Azha), I extend my warm greetings and good wishes to all Muslim brethren of Andhra Pradesh. Bakrid symbolizes sacrifice, absolute devotion to the Almighty and compassion for the poor and emphasises on the principle of sharing. pic.twitter.com/IGlUc67zK6
— governorap (@governorap) June 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"On the solemn occasion of Bakrid (Id-ul-Azha), I extend my warm greetings and good wishes to all Muslim brethren of Andhra Pradesh. Bakrid symbolizes sacrifice, absolute devotion to the Almighty and compassion for the poor and emphasises on the principle of sharing. pic.twitter.com/IGlUc67zK6
— governorap (@governorap) June 29, 2023"On the solemn occasion of Bakrid (Id-ul-Azha), I extend my warm greetings and good wishes to all Muslim brethren of Andhra Pradesh. Bakrid symbolizes sacrifice, absolute devotion to the Almighty and compassion for the poor and emphasises on the principle of sharing. pic.twitter.com/IGlUc67zK6
— governorap (@governorap) June 29, 2023
Bakrid: రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా బక్రీద్
ముస్లింలకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు: ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగ నిరతికి నిదర్శనమని, అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మనకు కలిగిన దానిని సాటివారితో కలిసి పంచుకోవాలని చెప్పే గొప్ప మానవతా భావాన్ని చాటే బక్రీద్ పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. త్యాగనిరతి, ధర్మ నిబద్ధత, దైవభక్తిని చాటే పండుగ బక్రీద్ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
Bakrid Wishes: విశ్వాసం, ఐక్యతకు బక్రీద్ ప్రతీక: సీఎం జగన్
ముస్లింలకు చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు: త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ సందర్భంగా ముస్లింలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరుల త్యాగనిరతిని, ధర్మ నిబద్ధతను, దైవ భక్తినీ చాటే పండుగ బక్రీద్ అని ఆయన తెలిపారు. మనకు కలిగిన దానిని సాటివారితో కలిసి పంచుకోవాలని చెప్పే గొప్ప మానవతా వాదాన్ని చాటే బక్రీద్ పండుగను.. భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముస్లింలకు బాలకృష్ణ బక్రీద్ శుభాకాంక్షలు: ముస్లింలకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ హితం కోసం అల్లాహ్ ఆజ్ఞ మేరకు మహ్మద్ ప్రకవక్త తన ప్రియ కుమారుల్లో ఒకరిని త్యాగం చేయడానికి సిద్ధపడగా.. ఆ త్యాగాన్ని స్మరిస్తూ జరుపుకునే పండుగే ఈద్- అల్- అదా అని ఆయన చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ చాటుతుందని పేర్కొన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు కొంత పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదు అనే స్ఫూర్తి సూత్రంతో ముస్లింలు కుటుంబ సమేతంగా పండుగ జరుపుకొవాలని కోరుకున్నట్లు చెప్పారు.
భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు
ముస్లింలకు లోకేష్ బక్రీద్ శుభాకాంక్షలు: ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్.. త్యాగం, భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమని లోకేష్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ముస్లింలకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
-
ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్ త్యాగం, భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతం.#EidAlAdha
— Lokesh Nara (@naralokesh) June 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్ త్యాగం, భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతం.#EidAlAdha
— Lokesh Nara (@naralokesh) June 29, 2023ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్ త్యాగం, భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతం.#EidAlAdha
— Lokesh Nara (@naralokesh) June 29, 2023