ETV Bharat / state

చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద రెక్కీ.. కారు మాయం.. పోలీసులకు ఫిర్యాదు - Chikoti Praveen car was stolen

Casino Agent Chikoti Praveen Car theft : తన కారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కొంతమంది వ్యక్తులు వారం రోజులుగా తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు తెలిపారు. రెక్కీ నిర్వహించిన వారే.. తన కారును దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Chikoti Praveen Car theft
చీకోటి ప్రవీణ్ కారు దొంగతనం
author img

By

Published : Feb 22, 2023, 2:06 PM IST

చీకోటి ప్రవీణ్ కారు దొంగిలించిన దుండగులు ఎవరు..?

Casino Trader Chikoti Praveen Car theft : క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ కారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారట. తన కారు దొంగతనానికి గురైందని ఆయనే స్వయంగా సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది దుండగులు కొన్ని రోజులుగా తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు. తన కారు చోరీ అయిన తరువాత సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తే రెక్కీ.. నిర్వహించిన వారే ఎత్తుకెళ్లినట్లు తేలిసిందని పోలీసులకు చెప్పారు. గతంలో కూడా పలుమార్లు.. అనుమానాస్పద యువకులు తన ఇంటి వద్ద రెక్కీ చేసినట్లు.. పోలీసులకు ఫిర్యాదు చేశానని చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు.

Casino Dealer Chikoti Praveen Car theft case : ఈనెల 20వ తేదీన తెల్లవారుజామున కొంతమంది దుండగులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి కారును దొంగతనం చేశారని ప్రవీణ్ తెలిపారు. ఇన్నోవా క్రిస్ట్ టీఎస్11 ఈ క్యూ 0444 నెెంబర్​తో ఉన్న వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ప్రవీణ్ వివరించారు. వెంటనే కారు చోరీ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని ఆయన పోలీసులను కోరారు. అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించని క్రమంలో.. విఫలమైన దుండగులు.. తరువాత అతని అపార్ట్మెంట్​ పార్కింగ్​లో ఉన్న కారును ఎత్తుకెళ్లారని చీకోటి.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన.. సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Chikoti Praveen car was stolen in Hyderabad: కాగా గత సంవత్సరం సంక్రాంత్రి సంబురాల్లో.. గోవా తరహాలో క్యాసినో ఏర్పాటు చేసి ఏపీ రాజకీయాలను చీకోటి ఓ కుదుపు.. కుదుపిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది దుండగులు చీకోటి ప్రవీణ్ ఇంట్లో వేల కోట్ల రూపాయలు ఉంటాయనే ఆలోచనతోనే.. రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

నాకు ముప్పు ఉంది.. పోలీసుల భద్రత కావాలి: గతంలో.. ఈడీ విచారణ ముగిసేంత వరకూ.. తనకు పోలీసు భద్రత కల్పించాలని ప్రవీణ్ పోలీసులకు కోరారు. దీనిపై పోలీసులు పట్టించుకోకపోవడంతో.. ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈడీ విచారణ వల్ల.. తన కుటుంబానికి ముప్పు ఏర్పడిందని పిటిషన్​లో ప్రవీణ్ తెలిపారు. తన ఇంటి దగ్గర.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్నారని ఆయన కోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు.. చీకోటికి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించింది. అతని అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని.. నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్​ సీపీకి సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.