గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. రూరల్ ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకే ఈ కార్యక్రమం చేపట్టారు. గుట్కా, సారాయి, గంజాయి, మారణాయుధాలు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. సుమారు 65 మంది పోలీసులు పాల్గొన్న తనిఖీల్లో..... సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: