గుంటూరు జిల్లా రేపల్లె మండలం మోర్తోట వద్ద కారు ప్రమాదానికి గురైంది. పంట కాలువలోకి కారు దూసుకుపోయిన ఘటనలో శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడు. విజయవాడలో ఉంటున్న శ్రీనివాస్... పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పిరాట్లంకలో ఉన్న అత్త వారింటికి వచ్చారు. బుధవారం బంధువులను కలిసి, తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పింది. మోర్తోట సమీపంలో కాలువలో పడిపోయింది. తెల్లవారుఝామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: