గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలో మహిళా జేఏసీ నేతలు ధర్నా చేశారు. రాజధాని తరలివెళ్ళిపోతుందని మనస్తాపంతో మృతి చెందిన రైతులకు కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ నివాళులర్పించారు. గ్రామంలో వీధుల వెంట జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ 3 రాజధానులపై నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. తాడేపల్లి గ్రామస్థులు అమరావతికి మద్దుతుగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఇవీ చదవండి: