అమరావతికి మద్దతుగా గుంటూరులో రాజకీయేతర ఐకాస కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులు, యువత ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అంబేడ్కర్ కూడలి నుంచి నాజ్ సెంటర్ వరకూ ఈ ప్రదర్శన సాగింది. జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో గళమెత్తి... రాజధాని ఆకాంక్షల్ని బలంగా చాటారు. రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. అన్నదాతల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించటం సరికాదన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెచప్పుడని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథాన నడిపించాల్సిన పాలకులు... మూడు రాజధానుల పేరుతో కొత్త సమస్యలు సృష్టించి ఏపీకి పెట్టుబడులు రాకుండా చేశారని విమర్శించారు.
ఇవీ చదవండి: