గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. 12 రోజులుగా తమకు అన్యాయం జరుగుతుందంటూ రోడ్డుపై బైఠాయించారు. తమకు వేతనాలు ఇవ్వకుండా కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలను పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యంత్రాలకు అడ్డుకట్ట వేసి... భవన కార్మికులకు అన్నివిధాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఆగని ఆత్మహత్యలు... మరో కార్మికుడు బలి..!