గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో విద్యుత్ షాక్కు గురై ఆరు గేదెలు చనిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొత్తపాలెం గ్రామంలో ఓ విద్యుత్ స్తంభం పడిపోయింది. మేత కోసం వెళ్లిన పశువులు వర్ష ప్రభావానికి తిరిగి వచ్చే క్రమంలో విరిగి పడిన విద్యుత్ స్తంభం తీగలు తగిలి షాక్ గురయ్యాయి. ఈ ఘటనలో 6 గేదెలు అక్కడికి అక్కడే మరణించాయి.
వర్ష ప్రభావం తగ్గిన తరువాత గమనించిన స్థానికులు పశువుల యజమానులకు, విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. సాయంత్ర సమయంలో ప్రమాదం జరిగి వర్షం నిలిచిన కూడా.. సంబధిత అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు గాని.. మరమ్మతులు చేసి తెగిన తీగలను తొలగించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరే ప్రమాదానికి కారణమని మండి పడుతున్నారు. ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల వరకు నష్టం కలిగినట్లు బాధితులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు