ETV Bharat / state

గుంటూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. పాత కక్షలేనా..!

Midnight Murder: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ హత్య జరిగింది. తెనాలిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బత్తుల అనిల్​ను దుండగులు దారుణంగా హత్య చేశారు. సీసీ కెమెరా రికార్డులు పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Brutal murder in Guntur distric
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ హత్య
author img

By

Published : Oct 30, 2022, 2:58 PM IST

Midnight Murder: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ హత్య జరిగింది. తెనాలిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బత్తుల అనిల్​ను దుండగులు దారుణంగా హత్య చేశారు. సుల్తానాబాద్​ వడ్డెర కాలనీకి చెందిన అనిల్​ను శనివారం రాత్రి 11గంటలకు ఐదుగురు వ్యక్తులు వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దుండగుల నుంచి రక్షించుకునేందుకు తీవ్ర గాయాలతో అనిల్ పరుగులు పెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరా రికార్డులు పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బత్తుల అనిల్ తెనాలిలో తాపీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. గత ఆరు నెలల నుంచి హైదరాబాదులో ఉండి.. పని చేసుకుంటూ రెండు రోజుల క్రితం సొంత ఊరికి వచ్చాడు. రాత్రి సుల్తానాబాద్​లోని శివాలయం దగ్గర, కొంతమంది కుర్రాళ్లతో కలిసి మద్యం తాగుతూ గొడవ పడుతుండగా స్థానికులు సర్దిచెప్పి అక్కడనుంచి పంపించారు. అర్ధరాత్రి 11గంటలకు అప్పడాల కంపెనీ గేటు ముందు రక్త గాయాలతో పడి ఉన్నాడు. గుండెపై రెండు కత్తి పోట్లు పడటంతో అనిల్ అక్కడికక్కడే చనిపోయాడు. శవాన్ని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.