ETV Bharat / state

మాట్లాడే సాంకేతిక పుస్తకాన్నిచూశారా? - GUNTUR LATEST NEWS

ఆ పుస్తకం మాట్లాడుతుంది.... అవును మీరు విన్నది నిజమే. మామూలుగా పుస్తకం అంటే మనం చదవడానికే మాత్రమే వీలవుతుంది. ఈ సాంకేతిక పుస్తకం మాత్రం అన్ని భాషల్లో మాట్లాడుతుంది. అంధులు, చదువు రాని వారు కూడా ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకోవచ్చు. చిన్నారులు కూడా వారికి కావాల్సిన విషయాలను సులువుగా వినేయవచ్చు

మాట్లాడే సాంకేతిక పుస్తకం
మాట్లాడే సాంకేతిక పుస్తకం
author img

By

Published : Dec 31, 2020, 4:24 PM IST

ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదవాలంటే చదువురావాలి. దాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. చదువురాని వారికి, అంధులకు అది ఒక రకంగా సమస్యే. అందులోని అంశాలను తెలుసుకోవాలన్నా కుదరని పరిస్థితి. అలాంటి వారి కోసం ఓ సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. చిన్నపిల్లలు కూడా విజ్ఞాన పుస్తకాల సారాన్ని ఈ పరికరం ద్వారా సులువుగా నేర్చుకోవచ్చు.

చిన్నపాటి గద రూపంలో ఉండే ఈ పరికరాన్ని పుస్తకంలోని పేజీలపై ఉంచితే...శ్లోకాన్ని వినిపించటంతోపాటు.... దాని అర్థాన్ని వివరిస్తుంది. తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో ఉన్న హనుమాన్ చాలీసాను వినేలా ఈ పరికరం రూపొందించారు. గ్రంథంలోని చిత్రాలపై ఈ గద పెడితే స్తోత్రాలు, జై శ్రీరామ్ శబ్దాలు వినిపిస్తాయి. పక్షులు, జంతువులు, రాక్షసుడు ఇలా భిన్నమైన ధ్వనులు వినిపిస్తాయి. పరికరంలోని సెన్సార్లు ఆయా పేజీలను, అందులోని అంశాలను గుర్తించేలా రూపకల్పన చేశారు.

ఇక చిన్నపిల్లలకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు కూడా ప్రస్తుతం స్మార్ట్ స్టార్ పేరిట మార్కెట్లోకి వచ్చాయి. భాషా పరిజ్ఞానంతోపాటు వైజ్ఞానిక అంశాలు, జనరల్ నాలెడ్జ్, లెక్కలు ఇలా విభిన్నమైన విషయాలపై ఈ పుస్తకాలు ఉంటాయి. వీటిని కూడా పిల్లలు సులువుగా వినేలా, అర్థం చేసుకునేలా అనుబంధ పరికరాన్ని రూపొందించారు. టాకింగ్ టెడ్ అని పిలిచే ఈ బొమ్మలాంటి పరికరంతో చదవటంతో పాటు ఆడుకున్నట్లు ఉంటుంది.

సాంకేతిక పరికరాలను ఛార్జింగ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా పుస్తకాలు, సంబంధిత పరికరాలు కొనుగోలు చేయవచ్చు.

మాట్లాడే సాంకేతిక పుస్తకాన్నిచూశారా?

ఇవీ చదవండి

ఆకట్టుకుంటున్న సోషల్​ మీడియా లోగో కేకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.