ETV Bharat / state

'బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నవారికి జీజీహెచ్​లో చికిత్స'

author img

By

Published : May 25, 2021, 5:09 PM IST

గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నవారికి జీజీహెచ్​లో వైద్య చికిత్స అందిస్తున్నామని.. జిల్లా పాలనాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులను ఎదుర్కొనేందుకు పక్కాగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. అనంతరం భారతీయ విద్యాభవన్ లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

guntur ggh
guntur ggh

గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులను ఎదుర్కొనేందుకు పక్కాగా కార్యాచరణ అమలు చేస్తున్నామని.. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నవారికి జీజీహెచ్​లో వైద్య చికిత్స అందిస్తున్నామని.. ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. ప్రస్తుతానికి కొన్ని ఇంజెక్షన్లకు కొరత ఉందని.. ఈ సమస్యను త్వరలోనే అధిగమిస్తామని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతీయ విద్యాభవన్ లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 45 ఏళ్లు దాటిన వారికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు రెండు రోజుల పాటు డ్రైవ్ చేపట్టి టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ప్రాధాన్యతను అనుసరించి జిల్లాలో ప్రణాళికయుతంగా వ్యాక్సినేషన్ చేపడుతున్నామని వివరించారు.

ఇదీ చదవండి:

ఇద్దరు చెల్లెళ్లతో పాటు విశ్రాంత బ్యాంకు మేనేజర్‌ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.