రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో భాజపా కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. 2014 నుంచి దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి నిధులు.. కేంద్రం రాష్ట్రాభివృద్ధికి ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రం బాగుపడేందుకు తమపార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. జులై 6 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని వివరించారు.
ఇదీ చదవండి... "తెదేపాకు పట్టిన గతే... వైకాపాకు పడుతుంది"