భాజపాలో చేరిన తెలుగుదేశం పార్టీ నేతలు వారు ఎదుర్కొంటున్న అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. గతంలో తమ ఎంపీలను వెనకేసుకొచ్చిన తెదేపా నేతలు... ఇప్పుడు వారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏది నిజమో తెదేపా నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపాలో చేరే సమయంలో తెదేపా సభ్యులు దేశాభివృద్ధి కాంక్షించి చేరుతున్నట్లు చెప్పిన విషయం గుర్తు చేశారు.
భాజపాలో చేరిన ఎవరైనా... పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. భాజపాకి రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేని కారణంగానే ఇతర పార్టీల ఎంపీలను చేర్చుకున్నట్లు చెప్పారు. ఐదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా... రాజ్యసభలో సరిపడా బలం లేక ముఖ్యమైన నిర్ణయాలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. 2020 నాటికి ఎన్డీయే కూటమికి రాజ్యసభలో పూర్తి బలం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమైన బిల్లులను విపక్షాలు అడ్డుకోలేవన్నారు.
ఇదీ చదవండీ...