ETV Bharat / state

'బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలి' - kanna laxmi narayana comments on panchayth electiosn

బలవంతంగా నామపత్రాలు లాక్కుని.. నామినేషన్లు అడ్డుకునే సంస్కృతి వైకాపా పాలనలోనే చూస్తున్నామని భాజపా నేత లక్ష్మీనారాయణ విమర్శించారు. వైకాపా అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలనుకుంటే భాజపా, జనసేన బలపర్చిన అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. బలవంతపు ఏకగ్రీవాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

kanna laxmi narayana on panchayth elections
భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ
author img

By

Published : Feb 1, 2021, 1:45 PM IST

పంచాయతీ ఎన్నికల్లో బలవంతంగా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్​ చేశారు. గతంలో టెండర్​ పత్రాలను దొంగలించడం చూశాం కానీ.. నామినేషన్లు పత్రాలను దోచుకెళ్లడం మాత్రం చూడలేదని చెప్పారు.

రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చామని రెచ్చిపోతున్న వైకాపా ప్రభుత్వానికి అదే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కన్నా హెచ్చరించారు.

ఇదీ చదవండి:

నిమ్మాడ ఘటనపై ఎస్​ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.