BJP SUNIL DEODHAR : వచ్చే ఎన్నికల్లో జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయని భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ స్పష్టం చేశారు. తెదేపాతో పొత్తు పెట్టుకోబోమని తేల్చిచెప్పారు. పవన్ అడిగిన రోడ్డు మ్యాప్‌పై అంతర్గతంగా చర్చించుకుంటామన్న సునీల్.. కన్నా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదని తెలిపారు. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు లేవని పేర్కొన్నారు. ఏపీలో ఓటు వేసిన ప్రజలకే వైకాపా వెన్నుపోటు పొడుస్తోందని మండిపడ్డారు.
ఇవీ చదవండి: