గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. 32వ డివిజన్లో భాజపా-జనసేన అభ్యర్థుల తరుపున భాజపా మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామిని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే భాజపా-జనసేన బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని యామిని కోరారు. నగర అభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం వాటిని సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తూ అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు.
ఇదీచదవండి.