వైకాపా పాలనలో ప్రజలు కట్టిన పన్నులు, కేంద్రం ఇచ్చే నిధులు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. భాజాపా-జనసేన అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నగరాలు, పట్టణాల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి..అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైకాపా నేతలు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఓట్లేస్తే..రాబోయే రోజుల్లో 10 రెట్లు పన్నుల భారం మోయాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. భాజపా-జనసేన అభ్యర్థులను గెలిపిస్తే అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు.
ఇదీచదవండి