జీవో 39పై స్పష్టత ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌లో సింహాచలం భూములు కబ్జా చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు. జీవో 888 ద్వారా 2016 నాటి ప్రొసిడింగ్స్‌నే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెదేపా నిర్ణయాలపై రివర్స్ టెండర్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌కు 4 అంశాలపై లేఖ రాశానన్న ఆయన... వాటికి ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయ భూములు విక్రయించబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి