ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల తరహాలోనే బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి లాగిన్ నుంచి బయోమెట్రిక్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డ తొలి బాధితురాలు