ETV Bharat / state

కరెంట్​ నిలిపేసి బెంచీల ధ్వంసం - 'విధ్వంసానికి బ్రాండ్​ అంబాసిడర్​ జగన్​' - నారా లోకేశ్ బెంచీల ఏర్పాటు

Benches Destroyed in Mangalagiri Constituency: రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాల సంస్కృతి పెరిగిపోతోంది. అవతలి పార్టీ నాయకుడ్ని దెబ్బతీసేందుకు ఎంతటి నీచపు చర్యకైనా వెనకాడటం లేదు. దానివల్ల తమకు చెడ్డపేరు వస్తుందని తెలిసినా, ప్రత్యర్థులకు ఆదరణ పెరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నారు.

benches_destroyed_in_mangalagiri_constituency

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 12:28 PM IST

Benches Destroyed in Mangalagiri Constituency: తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని కొందరు దుండగులు దుశ్చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి నీచమైన చర్యలు గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో సేద తీరేందుకు ఏర్పాటు చేసిన బెంచీలను ధ్వంసం చేసే వరకు దిగజారాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సొంత నిధులతో తన నియోజకర్గంలోని పలు గ్రామాల్లో సిమెంట్​ బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ బెంచీలను ధ్వంసం చేయడం అధికార పార్టీకి చెందిన వారి పనే అనే అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.

కరెంట్​ నిలిపేసి బెంచీల ధ్వంసం - 'విధ్వంసానికి బ్రాండ్​ అంబాసిడర్​ జగన్​'

అసలేం జరిగిందంటే : నారా లోకేశ్​ తన సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా మంగళగిరిలోని గ్రామాల్లో సిమెంట్​ బెంచీలను ఏర్పాటు చేశారు. అయితే దుగ్గిరాల మండలం తుమ్మపూడి, పేర్లపూడిలో గుర్తు తెలియని దుండగులు సంక్రాంతి పండగ రోజున సుమారు 9 సిమెంట్​ బెంచీలను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

YSRCP ignored TDP started development works: వైసీపీ ప్రభుత్వ నీచపు చర్య..! టీడీపీ ప్రారంభించిన పనులన్నీ పాతాళానికి తొక్కుతూ..

రాత్రి సమయంలో విద్యుత్​ సరఫరా నిలిపివేసి మరి: పేర్లపూడిలో సంక్రాంతి పండగ రోజు రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ నీచపు కార్యానికి దిగారని స్థానిక తెలుగుదేశం నాయకులు అంటున్నారు. బెంచీలను ధ్వంసం చేసే సమయంలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు విద్యుత్​ సరఫరా నిలిపివేసి మరీ ఈ చర్యకు పూనుకున్నారని టీడీపీ నేతలు వివరించారు. బెంచీలు లోకేశ్​ ఏర్పాటు చేయడంతో లోకేశ్​కు ఆదరణ దక్కకుడాదనే, పైశాచికత్వంతో ఈ చర్యకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

కఠిన చర్యలు తీసుకపోతే ఆందోళన: గ్రామస్థులకు ఉపయోగపడతాయని ఏర్పాటు చేస్తే, ఇలా ధ్వంసం చేస్తారా అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి, వెంటనే శిక్షించాలని స్థానికులు డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని టీడీపీ నేతలు హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణ చేపట్టి, చర్యకు పాల్పడిన వారిని గుర్తిస్తామని పోలీసులు వివరించినట్లు టీడీపీ నేతలు వివరించారు.

తాలిబన్ పాలన గుర్తుకుతెస్తున్న జగన్​ పాలన - దళితులపై హింసను నిలువరించాలి : లోకేశ్

స్పందించిన నారా లోకేశ్​: బెంచీలను ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసానికి బ్రాండ్​ అంబాసిడర్​ జగన్​ అని అనేది ఇందుకేనని ఆయన దుయ్యబట్టారు. ఈ విధ్యంసానికి స్వస్తి పలకాలని, 2024లో జగన్​ అధికారంలో ఉండరని సామాజిక మాధ్యమం ఎక్స్​లో లోకేశ్​ స్పందించారు.

Lokesh Fire On CM Jagan : జైల్లో పెట్టినా కక్ష తీరలేదా..! చంద్రబాబు లేఖ అంటే ఎందుకు భయం? : లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.