Begumpet Police Seized RS 4 Crore Hawala Money: తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో హవాలా రాకెట్‌కు అడ్డుకట్ట వేసే వారే లేకుండా పోతుంది. మొన్నటివరకు డ్రగ్స్ స్మగ్లింగ్.. నేడు హవాలా మనీ అక్రమ రవాణా.. ఇలా రోజుకొకటి వార్తలో నిలుస్తుంది. తాజాగా రెండు కార్లలో తరలిస్తున్న రూ.4 కోట్ల నగదును హైదరాబాద్‌లోని బేగంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రీన్‌ల్యాండ్స్ వైపు నుంచి ప్యారడైజ్ వైపు వెళ్తున్న రెండు కార్లను ప్రకాశ్‌నగర్ సమీపంలోని బ్రిడ్జి వద్ద బేగంపేట పోలీసులు అడ్డుకున్నారు. రెండు కార్లను తనిఖీచేసి రూ.4 కోట్ల నగదును గుర్తించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, ప్రశాంత్, విపులచౌదరి అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తాము రుతుప్రియ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన వారమని వారు వెల్లడించారు.
సుమారు 3 గంటల పాటు కొనసాగిన విచారణలో నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదు. నగదుతోపాటు, ముగ్గురిని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు బేగంపేట ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాస్‌రావు తెలిపారు. వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీన్ని హవాలా సొమ్ముగా అనుమానిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి: