గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన చింతల వినయ్, మనోజ్ఞ దంపతుల కుమార్తై అవిజ్ఞ. భార్యాభర్తలిద్దరూ... మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వారి కార్యాలయానికి వెళ్లిన అవిజ్ఞ... అక్కడ ఈత కొలను చూసి... తాను స్విమ్మింగ్ నేర్చుకుంటానని తండ్రిని అడిగింది. ఆమె ఆసక్తిని గమనించిన వినయ్... ఆమెకు శిక్షణ ఇప్పించాడు. ఫ్రీ స్టెయిల్, బ్యాక్ స్ట్రోక్, బెస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై కిక్ విభాగాల్లో నైపుణ్యం సాధించింది.
2017లో ఒమన్‌లో నిర్వహించిన అండర్-18 ఈత పోటీల్లో (swimming competition) పాల్గొన్న అవిజ్ఞ.. అద్భుత ప్రతిభ కనబరిచి.. ఐదు పసిడి పతకాలు గెలిచింది. 2019లో అండర్-10 ఒమన్ కప్ పోటీల్లో విజేతగా నిలిచి ప్రశంసలు అందుకుంది. 2019-2020లో భోపాల్‌లో నిర్వహించిన సీబీఎస్ఈ జాతీయ పోటీల్లో రెండు రజత పతకాలు దక్కించుకుంది. 2020 ఫిబ్రవరిలో దుబాయ్‌లో నిర్వహించిన మధ్య ఆసియా దేశాల జూనియర్ ఈత పోటీల్లో ఆరు పతకాలు గెలిచి... అందరి దృష్టిని ఆకర్షించింది. నరసరావుపేటలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో (swimming competition) ఐదు విభాగాల్లోనూ... ఐదు పసిడి పతకాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. అండర్-12 బాలికల రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచిన అవిజ్ఞ.. ఒమన్‌లో అండర్-12 ఛాంపియన్ షిప్ సాధించింది. బెంగళూరులో అక్టోబరు 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న జాతీయ ఈత పోటీలకు ఎంపికైంది.
'బెంగళూరులో నేషనల్స్ సెలెక్ట్ అయ్యాను. ఒలంపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం.'- అవిజ్ఞ
ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న అవిజ్ఞ... ప్రతిరోజూ గంటన్నర పాటు స్మిమ్మింగ్ (swimming)సాధన చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండే పోటీకి తగినట్లు తన నైపుణ్యాలు పెంచుకుంటోంది. ప్రస్తుతం జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించేందుకు శ్రమిస్తోంది.
'అవిజ్ఞ రాష్ట్ర స్థాయిలో ఐదు మెడళ్లు సాధించింది. నేషనల్స్‌కు సెలెక్ట్ అయ్యింది. బెంగళూరులో అక్టోబర్ 19 నుంచి 23 వరకు జరిగే నేషనల్స్‌లో ఏపీ తరఫున పాల్గొంటుంది. ఈ కాంపిటిషన్స్ కోసం ఒమన్ నుంచి వచ్చాం. దుబాయ్‌లో 6 మెడల్స్ సాధించింది. ఒలంపిక్స్‌లో సెలెక్ట్ అవ్వాలని అవిజ్ఞ లక్ష్యం'- చింతల వినయ్ ,అవిజ్ఞ తండ్రి
ఇదీ చదవండి: