గుంటూరు జిల్లాలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో... ప్రజలు ఫోన్ చేయాల్సిన నంబర్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. రెడ్ జోన్ల నుంచి ప్రజల రాకపోకలు నిషేధించాలని, అక్కడి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో డోర్ టు డోర్ సర్వే చేయాలని... ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి నేడు గుంటూరులో ఒకే ఒక కరోనా కేసు