ETV Bharat / state

'ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ముప్పు.. భద్రత పెంచండి' - Andhra Pradesh news

Bandi Sanjay on TRS mlas buying issue: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు అంతా డ్రామా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ విడుదల చేసిన వీడియోలో ఏమీ లేదన్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకున్న తన కుమార్తె కవితను రక్షించడానికి కేసీఆర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

Bandi Sanjay comments
అధ్యక్షుడు బండి సంజయ్‌
author img

By

Published : Nov 4, 2022, 7:51 PM IST

Bandi Sanjay on trs mlas buying issue: సీఎం కేసీఆర్‌ దిల్లీలో కూర్చుని మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ ఘటనకు స్క్రిప్టు రాసుకున్నారని, దిల్లీ నుంచి రాగానే డీజీపీతో సమావేశమై ఫామ్‌హౌస్‌ డ్రామా నడిపించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. తన కుమార్తెను రక్షించుకునేందుకు కేసీఆర్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణం కేసు దిల్లీలో నమోదైంది కాబట్టి కవితను ఎవరూ రక్షించలేరన్నారు.

హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్టోబరు 26న ఉదయం 11.30కు పోలీసులకు ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారట. మధ్యాహ్నం 3గంటలకు పోలీసులు ఫామ్‌హౌస్‌లో కెమెరాలు అమర్చినట్టు చెప్పారు. నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకెళ్లలేదు. ఫామ్‌హౌస్‌ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్‌కు ఎందుకు వెళ్లారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌ నుంచి బయటకు రానివ్వట్లేదు.. వారికి పోలీసులు భద్రతా పెంచాలి. నలుగురు ఆణిముత్యాలు వెళ్లి నకిలీ గ్యాంగ్‌ ట్రాప్‌లో చిక్కుకున్నారు. కేసీఆర్‌ చెబుతున్న తుషార్‌కు భాజపాతో ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ ఆగస్టు 30న జీవో జారీ చేశారు. కుమారుడు, కుమార్తెను రక్షించుకునేందుకు కేసీఆర్‌ ఏమైనా చేస్తారు. కేసీఆర్‌ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. సంతలో పశువుల మాదిరిగా ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే భాజపాలోకి చేర్చుకుంటున్నాం. కానీ, రాజీనామా చేయకుండానే తెరాసలో చేర్చుకుంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలపై కూడా కేసీఆర్‌కు నమ్మకం లేదు’’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.

కేసీఆర్‌ వద్ద ఆధారాలు ఉంటే కోర్టులో ఎందుకు సమర్పించలేదు. కోర్టులో ఉన్న అంశంపై ఎవరూ మాట్లాడవద్దని కేటీఆర్‌ ట్విటర్‌లో చెప్పారు. కోర్టులో ఉన్న అంశంపై సీఎం కేసీఆర్‌ ఎందుకు మాట్లాడారు? తెరాస ప్రభుత్వం అన్ని దొంగ జీవోలు జారీ చేస్తోంది. డ్రగ్స్ ఫైల్స్‌, లిక్కర్‌ ఫైల్స్‌, కాళేశ్వరం ఫైల్స్‌, నయీం డైరీ ఫైల్స్ తీస్తాం. నలుగురు ఎమ్మెల్యేలను మీడియా సమావేశానికి ఎందుకు తీసుకురావట్లేదు. కొప్పుల ఈశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు. కేటీఆర్‌ వద్దని చెప్పినందుకే కొప్పుల ఈశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.