నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( Narsapuram Mp Raghurama KrishnaRaju ) బెయిల్‌కు సంబంధించిన పత్రాలను ఆయన తరఫు న్యాయవాదులు ( Guntur Cid Magistrate ) గుంటూరు సీఐడీ మెజిస్ట్రేట్‌కు అందజేశారు.
పలు సెక్షన్ల కింద అభియోగాలు..
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని సీఐడీ పోలీసులు ( Raghuramakrishna) రఘురామకృష్ణరాజుపై రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటికే బెయిల్ మంజూరు..
ఈ కేసులో ఇప్పటికే రఘురామకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని సైనిక ఆస్పత్రి ( Secunderabad Military Hospital )లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఈ నెల 24న న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పూచికత్తు పత్రాలు, డిపాజిట్లను సమర్పించారు.
నివేదిక సహా బెయిల్ పూచికత్తు సమర్పణ..
ఈ సందర్భంగా ఆస్పత్రి నివేదిక కావాలని న్యాయవాది అడగగా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికను, బెయిల్ పూచికత్తు పత్రాలను ( Bail Papers and Report ) శుక్రవారం అందజేశారు.
సీఐడీ మెజిస్ట్రేట్‌కు అందజేత..
ఎంపీ రఘురామ దిల్లీలో ఉన్నట్లు తమకు మీడియా ద్వారా తెలిసిందని గుంటూరు జిల్లా జైలు అధికారులు ( Guntur Jail Officers ) న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అన్ని పత్రాలు సీఐడీ మెజిస్ట్రేట్‌కు అందజేసినట్లు రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
ఇవీ చూడండి : CM Jagan review: రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు: సీఎం జగన్