గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో.. ఓ మహిళ 5 కిలోల బరువున్న బాబుకు జన్మనిచ్చింది. నందివెలుగుకు చెందిన రేష్మ అనే మహిళ.. తొలి కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. సాధారణ విధానంలో కాన్పు కష్టమని తేల్చిన వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. బాబు బరువు చూడగా 5 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు 2 నుంచి 4కిలోల వరకూ ఉంటారు. ఈ బాబు 5 కిలోలు ఉండటం.. అరుదైన విషయమని వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మాజీ ఎంపీపీని హత్య చేసి దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు