గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులకు ఆధికారులు కిసాన్ గోష్ఠి శిక్షణా నిర్వహించారు. వ్యవసాయ దిగుబడిని పెంచేలా...సాగు సమయంలో తీసుకోవాల్సిన మెలకువలకు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామారావు తెలిపారు. కార్యక్రమానికి ఐదు మండలాల నుంచి రైతులు హాజరయ్యారు. రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్దతిలో పంట దిగుబడిని ఎలా పెంచుకోవచ్చో కార్యక్రమనికి హాజరైన లామ్ ఫామ్ శాత్రవేత్తలు వివరించారు. అనంతరం సేంద్రియ పద్దతిలో రైతులు సాగు చేసిన పంటలను...అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ప్రదర్శించారు. ఇలాంటి అవగాహన సదస్సుల రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని రామారావు అన్నారు. రబిలో చేసే సాగుకు కూడా ఇప్పటి నుంచే ఎలా ప్రణాళిక చేసుకోవాలో రైతులకు వివరించడంతో పాటు..సేంద్రియ పద్దతిలో సాగుపై కూడా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: సామర్లకోటలో పేలుడు-ముగ్గురి పరిస్థితి విషమం