గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్లలో సముద్ర స్నానానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. రెండు కుటుంబాలకు చెందిన 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. వారందరూ నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామవాసులుగా సమాచారం. అతివేగం కారణంగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడిందని ప్రయాణికులు తెలిపారు. ఆటో పూర్తిగా ధ్వంసం అయింది. ఒకరికి చెవి తెగగా.. మరికొందరికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇవి చదవండి....బైక్, కారు ఢీ... ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు