గుంటూరు జిల్లా నిజాంపట్నంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. జెట్టి వద్ద చేపల కోనుగోలుకు వెళ్లిన ఇమ్రాన్ పఠాన్ పై మాజీ మంత్రి వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణరావు సోదరుడైన హరినాధ్ బాబు...తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. గొడవ నియంత్రించేందుకు ముందుకొచ్చిన తెదేపా కార్యకర్త వీర్రాజుపై కూడా చేయి చేసుకున్నారు. వారిద్దరికి తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానికులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెదేపా అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నందునే తనపై దాడి జరిగిందని బాధితుడు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడి - tdp ysrcp
గుంటూరు జిల్లా నిజాంపట్నంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. జెట్టి వద్ద చేపల కొనుగోలుకు వెళ్లిన ఇమ్రాన్ పఠాన్ పై వైసీపీ నేత మోపిదేవి వెంకట రమణారావు సోదరుడైన హరినాధ్ బాబు... తన అనుచరులతో కలిసి దాడి చేశాడు.