ETV Bharat / state

'16న పాలు పొంగించి గృహ ప్రవేశాలు చేసి తీరుతాం' - గుంటూరు కొవిడ్ కేర్ సెంటర్లు తాజా వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 52 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో పీఎంఏవై గృహాలను శుక్రవారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పార్టీ నాయకులతో కలసి సందర్శించారు. ముందస్తు ప్రకటించినట్లే లబ్ధిదారులను వెంటేసుకుని ఈ నెల 16న పాలు పొంగించి గృహ ప్రవేశాలు చేస్తామని ప్రభుత్వాన్నిహెచ్చరించారు.

'16న పాలు పొంగించి గృహ ప్రవేశాలు చేసి తీరుతాం'

author img

By

Published : Nov 13, 2020, 8:41 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 52 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో పీఎంఏవై గృహాలను పార్టీ శ్రేణులతో కలసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించారు.

వాటిల్లోనూ ప్రవేశాలు చేస్తాం..

కొవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్న గృహాలను శానిటైజ చేసి వాటిలో కూడా గృహ ప్రవేశాలు చేస్తామన్నారు. ఇల్లు లేని వారికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల నివాస స్థలాలు అందించాలని డిమాండ్ చేశారు.

వారి బాత్రూం కూడా..

ప్రజా ప్రతినిధులందరూ పెద్ద బంగళాల్లో నివసిస్తున్నారని, వారి బాత్రూం కూడా ఒక సెంటు పైనే ఉంటుందన్నారు. పేదలకు మాత్రం ఒక సెంటులోనే ఇల్లు నిర్మిస్తారని ఎద్దేవా చేశారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా..

ఇప్పటికైనా పేద ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉండేలా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం అంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ 7 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అందులోనూ అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చినట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.