ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ మృతి.. బంధువుల ఆందోళన

author img

By

Published : Jan 24, 2021, 12:57 PM IST

Updated : Jan 24, 2021, 2:29 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఆశా వర్కర్​గా పనిచేస్తున్న విజయలక్ష్మి గుంటూరు సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. వ్యాక్సిన్​ కారణంగానే మరణించారని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ మృతి.. బంధువుల ఆందోళన!

ఆశా వర్కర్​ విజయలక్ష్మి ఈ నెల 20న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అస్వస్థతకు గురైన ఆమెను జీజీహెచ్​లో చేర్చారు. ఆమె కరోనా వ్యాక్సిన్ వల్లే మరణించారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆశా వర్కర్లు, ప్రజా సంఘాల నాయకులు.. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబానికి ఇంటి స్థలం, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విజయలక్ష్మి కుటుంబానికి కలెక్టర్ భరోసా

విజయలక్ష్మి కుటుంబాన్ని ఆదుకుంటామని.. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​ కుమార్ హమీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​ కుమార్, జేసీ ప్రశాంతి, డీఎంహెచ్‌వో యాస్మిన్ పరామర్శించారు. కరోనా వ్యాక్సిన్ వల్లే విజయలక్ష్మి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయగా... ఇప్పటికే 10వేల మందికి వ్యాక్సిన్ డోసు వేశామని.. ఎక్కడా ఎలాంటి సమస్య లేదని కలెక్టర్ చెప్పారు. విజయలక్ష్మి మృతికి గల కారణాలను పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుసుకుంటామని.. బాధిత కుటుబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇంటిలో ఒకరి ఉద్యోగం, ఇంటి స్థలం ఇచ్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామి ఇచ్చారు. బాధితులు కోరుతున్నట్లు కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. విజయలక్ష్మి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్‌ తో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించామని.. పోస్టుమార్టం తర్వాత పూర్తి స్థాయి నివేదిక వస్తుందని.. డీఎంహెచ్‌వో యాస్మిన్ తెలిపారు. విజయలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తెదేపా నేతల నిరసన

జీజీహెచ్ వద్ద విజయలక్ష్మి కుటుంబీకులకు మద్ధతుగా తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. విజయలక్ష్మి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం హామీని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుబట్టారు. వారిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్​ను పోలీసులు కొంత దూరం నెట్టుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది.

విజయలక్ష్మి కుటుంబానికి కలెక్టర్ భరోసా

ఇదీ చదవండి:

దేశంలో మరో 14 వేల కరోనా కేసులు.. 155 మరణాలు

Last Updated : Jan 24, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.