గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో నిన్న మహిళపై కాల్పులు జరిపిన బాలాజీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి స్వగ్రామం బాపట్ల సమీపంలోని కర్లపాలెం కాగా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రేమించిన యువతితో పెళ్లి వద్దన్నందుకు నిన్న యువతి తల్లిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న మృతదేహం బాలాజీదేనని బంధువులు గుర్తించారు. సైనికోద్యోగిగా పని చేస్తున్న బాలాజీపై కేసు నమోదైనందున ఆర్మీ విధుల నుంచి సస్పెండ్ చేసింది.
తల్లిదండ్రులు ఏమంటున్నారు?
తమ కుమారుడికి ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆ అమ్మాయి బెదిరించిందని బాలాజీ తల్లిదండ్రులు ఆరోపించారు. భయమేసి తను వెళ్లాడని.. అయితే తన కొడుకుపై అత్యాచారం కేసు పెట్టిందని చెప్పారు. ఆ మనస్తాపంతోనే బాలాజీ బలవన్మరణానికి పాల్పడ్డాడని వాపోయారు.
ఇవీ చూడండి: