కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. టీకాలు పొందడం ప్రతి పౌరుడి జన్మహక్కు అని అన్నారు. మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
కరోనా మూడో వేవ్ వచ్చేలోగా టీకా కార్యక్రమం పూర్తిచేయాలన్నారు. అందరికీ టీకాలు ఇవ్వాలంటూ.. జూన్4న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తుందని అన్నారు. కరోనా ఖర్చుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో.. మరో జాయింట్ కలెక్టర్ పోస్టు!