ETV Bharat / state

Vasireddy Padma: 'మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది' - ap latest news

Vasireddy Padma: మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పద్మ అన్నారు. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడిలో.. ప్రేమోన్మాది వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై.. ఆమె స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ap women commission chair person vasireddy padma
'మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది'
author img

By

Published : Feb 9, 2022, 7:37 PM IST

Vasireddy Padma: ప్రేమోన్మాది వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడిలో జరిగింది. బాధిత యువతి కుటుంబసభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పద్మ పరామర్శించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

యువతి శ్రావణి మరణానికి కారణమైన నిందితులు నాగేంద్రబాబు, అతని తాత శ్రీనివాసరావు, వాలంటీర్ అనిల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు. మహిళల రక్షణకు.. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలు క్షణికావేశానికి లోనుకాకుండా.. దిశ యాప్ ద్వారా సమస్యలను తెలియజేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు దిశ యాప్ పై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించాలని.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

Viral Video: 'మిమ్మల్ని గెలిపించి తప్పు చేశాం'.. వైకాపా కార్యకర్త వీడియో వైరల్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.