ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - AP LATEST NEWS

.

AP TOP NEWS
AP TOP NEWS
author img

By

Published : Nov 17, 2022, 10:59 AM IST

  • విశాఖ దసపల్లా భూముల స్వాహాకు వడివడిగా అడుగులు..
    దసపల్లా భూముల స్వాహాకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం అధికార పార్టీ కీలకనేత అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. సదరు నేత ఒత్తిడికి తలొగ్గిన అధికారులు.. ఆగమేఘాలపై భూముల సబ్‌డివిజన్‌ పూర్తి చేశారు. ఇక అతిత్వరలోనే విశాఖ కలెక్టర్‌.. దసపల్లా భూములను 22ఏ నుంచి డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందనే ప్రచారం.. ముమ్మరంగా జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అప్పుల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానం..
    అప్పుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ తీసుకోని రుణాలను ఆంధ్ర ప్రదేశ్ తీసుకుంది. ప్రతి నెలా కాగ్‌ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తలొగ్గలేదని.. ఓ మహిళ పూరి గుడిసెను కూల్చేసిన వైకాపా నాయకుడు
    స్థానిక వైకాపా నాయకుడితో గడిపేందుకు ఒప్పుకోలేదని.. తమ పూరి గుడిసెను తొలగించారని.. ఓ మహిళ ఆరోపించారు. ఒంటరి మహిళగా ఉన్న తనను.. అధికార పార్టీకి చెందిన కొందరు గ్రామస్థాయి నాయకులు.. రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నెలలు గడుస్తున్నా వరద బాధితులకు అందని పరిహారం..
    గోదావరి వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ సహాయంగా ఇస్తామన్న పరిహారం.. నెలలు గడుస్తున్నా చాలా మందికి అందలేదు. సర్వే అనంతరం 8 వారాల్లోనే నగదు అందుతున్న ముఖ్యమంత్రి మాట. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 75 ఏళ్ల వయసులో భార్య చెల్లిని రెండో పెళ్లి చేసుకున్న మేయర్
    కర్ణాటకలోని హుబ్లీ ధార్వాడ్​కు చెందిన మాజీ మేయర్ డీకే చవాన్​​ 75 ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల క్రితం భార్య మరణించగా ఆమె సోదరి అనసూయతో బుధవారం ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు ఆయన కుటుంబసభ్యులతో పాటు బంధు మిత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈయన పెళ్లి విషయం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వంతెన కింద భారీగా జిలెటిన్ స్టిక్స్.. రైల్వేట్రాక్ పేల్చిన ప్రాంతానికి సమీపంలోనే
    ఇటీవల రాజస్థాన్ రైల్వేట్రాక్​పై పేలుడు జరిగిన ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో 186 కిలోల జిలెటిన్ స్టిక్స్​తో నింపిన ఏడు బస్తాలు దొరికాయి. భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • G20లో ఆకట్టుకున్న మోదీ విదేశీనేతలకు అదిరిపోయే బహుమతులు
    2023లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష బాధ్యతలను బుధవారం భారత్ స్వీకరించింది. వచ్చే ఏడాది జరిగే సమావేశాలకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ మేరకు ప్రస్తుత జీ20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో సదస్సు బాధ్యతలను మోదీకి అప్పగించారు. అధికారికంగా డిసెంబర్ 1 నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్​ చేపట్టనుంది. ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలకు ప్రధాని మోదీ అదిరిపోయే బహుమతులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫోన్​ ఏదైనా ఛార్జర్ ఒకటే.. త్వరలోనే దశల వారీగా అమలు..
    స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకూ ఒకేరకమైన ఛార్జింగ్‌ పోర్ట్‌ను అమర్చడాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయని వెల్లడించింది వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కామన్వెల్త్ గోల్డ్ విన్నర్​ శరత్​ కమల్​కు అరుదైన గౌరవం.. భారత్​ తరఫున తొలి ప్లేయర్​గా..
    భారత అగ్రశ్రేణి టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు, ఖేల్‌రత్న అవార్డ్​ గ్రహీత ఆచంట శరత్‌ కమల్​కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఐటీటీఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కార్తీకదీపం ప్రియమణి సినిమా హీరోయిన్‌ను మించిన సొగసులు
    కార్తీకదీపం సీరియల్‌లో విలన్ మోనితకు ఎంత క్రేజ్ ఉందో ఆమె దగ్గర పని చేసే అందాల పనిమనిషి ప్రియమణి(శ్రీదివ్య)కీ అంతే క్రేజ్ ఉంది. అయితే నెక్స్ట్ జనరేషన్ పేరుతో ఈ సీరియల్‌ మొత్తం మారిపోవడంతో ప్రస్తుతం ప్రియమణి సీరియల్‌లో కనిపించడం లేదు. అయితే ఈ అమ్మడు ఫొటోలతో సోషల్ మీడియాను మాత్రం హీటెక్కిస్తోంది. ఆమె ఫొటోలపై మీరూ ఓ లుక్ వేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.