Minister Merugu Nagarjuna Comments: నారా లోకేశ్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు వారిని అడ్డుకోవడంలో తప్పేముందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. ఎవైరనా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తేల్చిచెప్పారు. లోకేశ్ పాదయాత్ర ఎంతమందితో చేస్తున్నారో చూస్తే, ఆయన బలం ఏమిటన్నది తేలిపోయిందని ఎద్దేవా చేశారు. పాదయాత్రకు, ఆయనకు ఉన్న అర్హత ఏమిటని నిలదీశారు.
వివేకా హత్య కేసు నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు విడుదల చేసిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంపై ఆయన స్పందించారు. దళితులపై దాడులు, అఘాయిత్యాలకు పేటెంట్ చంద్రబాబుదేనని విమర్శించారు. ఎవరి ప్రభుత్వ హయాంలో ఎంత రక్తపాతం జరిగిందో చర్చించేందుకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు.
'గత 14సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వంలో సమయంలో జరిగిన ఘటనలపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఘటనలపై మేమూ, మా నేత స్పందించిన తీరు చూస్తునే ఉన్నారు. దళితులపై దాడులు, అఘాయిత్యాలకు పేటెంట్ చంద్రబాబుదే' -మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
ఇవీ చదవండి: