రేపటి నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు 1637 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తును చేపట్టారు. నలుగురు ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
గరుడ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు విధులను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఐటీ కోర్ టీమ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఇదీ చదవండి: