ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికే కొత్త రూల్ పెట్టిన 'మేఘా' - దేనికైనా సరే సై అంటున్న జగన్ సర్కార్ - మేఘా ఇంజనీరింగ్ కోసం ఉల్లంఘిస్తోన్న ఏపీ ప్రభుత్వం

AP Govt Violating Rules for Paying Bills: వైసీపీ సర్కార్‌ అస్మదీయుల కోసం ఆర్థిక నిబంధనలకు పాతరేస్తోంది. బడ్జెట్ ఆమోదం లేకుండానే.. వచ్చే ఏడాది ఫలానా సమయంలో బిల్లులు చెల్లిస్తామంటూ.. ముఖ్యమంత్రి సన్నిహితమైన గుత్తేదారు సంస్థకు.. ఇప్పుడే బ్యాంకు గ్యారంటీలను ఇస్తోంది. ఈ మేరకు మేఘా సంస్థ ప్రతిపాదనలకు వైసీపీ సర్కార్ సై అంటోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పాల్సిన అధికారగణం.. జీ హుజూర్ అంటోంది. ఫైనాన్సు కోడ్‌కు విరుద్ధంగా ఇప్పటికే 13 వందల కోట్ల రూపాయల గ్యారంటీలు సిద్ధం చేసింది.

AP_Govt_Violating_Rules_for_Paying_Bills

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 8:36 AM IST

AP Govt Violating Rules for Paying Bills: నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి కొత్త రూల్ పెట్టిన 'మేఘా' - దేనికైనా సరే సై అంటున్న జగన్ సర్కార్

AP Govt Violating Rules for Paying Bills: రాష్ట్రంలో పోలవరం సహా పలు ప్రాజెక్టుల పనులు చేస్తున్న, సీఎం జగన్‌కు సన్నిహితమైన మేఘా కంపెనీ..ఒక కొత్త తరహా చెల్లింపుల ప్రతిపాదన తీసుకొచ్చింది. తమకు రావాల్సిన.. పెండింగు బిల్లులను ఎప్పుడు చెల్లించేదీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే.. ఆ మేరకు కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటానని మెలిక పెట్టింది. 2,000 కోట్ల వరకు మేఘా సంస్థకు ఇలా రుణం ఇచ్చేందుకు కెనరా బ్యాంకు.. ముందుకొచ్చినట్లు తెలిసింది. సీఎం జగన్‌కు సన్నిహితమైన సంస్థ అడిగిందే తడవుగా జలవనరులశాఖ దాదాపు 1,300 కోట్ల బిల్లులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించేలా గ్యారంటీ ఇస్తోంది.

ఈ విధానానికి.. బిల్ ఆఫ్‌ ఎక్స్ఛేంజి త్రూ డిస్కౌంటింగ్‌ ఆప్షన్‌ అని పేర్కొంటున్నారు. సికింద్రాబాద్‌లోని.. లార్జ్‌ కార్పొరేట్‌ బ్రాంచిలో ఫలానా ఖాతాలో ఫలానా తేదీలోగా ఆ బిల్లు మొత్తం చెల్లిస్తామని.. జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి అంగీకరిస్తూ.. గ్యారంటీలు మేఘా కంపెనీకి ఇస్తున్నారు. ఆ కంపెనీ వాటిని చూపించి రుణం తీసుకుంటోంది. ఆ మొత్తాన్ని జలవనరులశాఖ.. ఆ అకౌంట్​లో జమచేసిన తర్వాత.. బ్యాంకు తన రుణం, వడ్డీ వసూలు చేసుకుంటుంది.

AP Govt Paid Crores to Monopoly Firm Megha: మేఘాకు కోట్లు సమర్పణ.. దాచిన మెటీరియల్​కూ చెల్లింపులు..!

పోలవరం ప్రాజెక్టు పనులు.. మేఘా కంపెనీయే చేస్తోంది. ఆ సంస్థకు 2024 మే 8 నుంచి ఆగస్టు 28 లోపు 255.79 కోట్ల బిల్లులు చెల్లిస్తామని గ్యారంటీ ఇస్తూ.. జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌.. గ్యారంటీ లేఖలు ఇచ్చారు. ఆ ప్రతిని.. ఆర్థికశాఖ కార్యదర్శికీ పంపారు. ఇది ఇంతవరకు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వచ్చే ఏడాది మే, ఆగస్టు నెలల్లో కచ్చితంగా బిల్లులు చెల్లిస్తామని.. జలవనరులశాఖ అంగీకరించిన గ్యారంటీ మొత్తం. ఇలా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి.. మొత్తం 1,300 కోట్ల వరకు ఎప్పుడు చెల్లించేదీ ముందే.. గ్యారంటీలు ఇవ్వనున్నారు.

ఆ ప్రతిపాదన ప్రస్తుత ఆర్థిక నిర్వహణ విధానాలకు పూర్తిగా భిన్నమని.. ఇలా చెల్లింపులు సాధ్యం కాదని తొలుత ఆర్థికశాఖ ఫైలులో పేర్కొందని.. ఇందుకోసం ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని రాసిందని తెలిసింది. సీఎం అనుమతితోనే.. ఉల్లంఘనలకు అడుగులు పడుతున్నాయని.. సమాచారం. వేలమంది కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడి బిల్లులు రాక అగచాట్లు పడుతుంటే సీఎం జగన్ సన్నిహిత కంపెనీకి మాత్రమే ఇలా దాసోహం అంటున్నారు. అస్మదీయ గుత్తేదారుకు ఆర్థిక కోడ్‌ కూడా దాటి అండదండలు అందించడం అక్రమాలకు పరాకాష్ఠగా నిలుస్తోంది.

Polavaram guide bund damaged : కుంగిపోయిన పోలవరం గైడ్​బండ్.. బాధ్యులెవరు..? భవిష్యత్ ఏమిటి?

ఏటా రాష్ట్ర రాబడి అంచనాలు, ఖర్చు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వం చట్టసభల నుంచి.. ఆమోదం తీసుకుంటుంది. ఆ ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీ వరకే ఈ బడ్జెట్‌కు ఆమోదం లభిస్తుంది. చట్టసభలు కూడా ఒక్క ఏడాదికే బడ్జెట్‌ ఆమోదిస్తాయి. మార్చి 31వ తేదీకి కేటాయించిన బడ్జెట్‌ ప్రకారం ఖర్చు చేయకపోతే ఆ బడ్జెట్‌ ల్యాప్స్‌ అవుతుంది. మరుసటి ఆర్థిక సంవత్సరంలో.. మళ్లీ అనుమతులు తీసుకున్నాకే ఏ బిల్లులైనా చెల్లించగలరు. పెండింగు బిల్లులు ఉన్నా.. తదుపరి బడ్జెట్‌లో ఆమోదానికి బదిలీ చేయాలి.

అలా చేయకపోతే మళ్లీ మొదటి నుంచి ఆమోదం పొంది.. బడ్జెట్‌ విడుదల ఆర్డర్స్ తీసుకోవాలి. అలాంటిది ప్రస్తుత బిల్లులు.. వచ్చే ఏడాది మే, ఆగస్టు నెలల్లో చెల్లిస్తామని ఐఏఎస్ అధికారులు రాసి సంతకాలు చేసి ఇవ్వవచ్చా? కోర్టు కేసులు.. ఏ ఇతర సమస్యలు చెల్లిస్తామని.. ఇలా గ్యారంటీ ఇవ్వగలరా? మే, ఆగస్టు నెల చెల్లింపులు అంటే కొత్త ప్రభుత్వం చేపట్టవలసినవి.

అప్పడు.. ఈ బడ్జెట్‌ కేటాయింపులను అసెంబ్లీ ఆమోదించకపోతే ఈ అధికారులు ఎలా చెల్లిస్తారు? ఆ గ్యారంటీలకు.. ప్రభుత్వం జవాబుదారీ కాదా? వచ్చే ఏడాది చెల్లింపులకు.. ముందే గ్యారంటీలు ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికైనా ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బడా గుత్తేదారులు.. బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఇలా రుణాలు తీసుకుని జగన్‌ ప్రభుత్వం నుంచి.. గ్యారంటీలు పొందుతున్నారు. చిన్న గుత్తేదారులు, సరఫరాదారులు మాత్రం.. పెండింగ్‌ బకాయిలు రాక అవస్థలు పడుతున్నారు.

Polavaram Project: పోలవరంలో మేఘా ఇంజినీరింగ్‌కు వరుసగా నాలుగో టెండరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.