ETV Bharat / state

రుయా ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం.. ఆక్సిజన్ మిగులు నిల్వలు ఉండేలా ప్రయత్నం!

author img

By

Published : Jun 2, 2021, 8:12 AM IST

తిరుపతి రుయా ఘటన తర్వాత అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆక్సిజన్‌ నిల్వ, రవాణాలో పట్టు బిగించింది. కరోనా వేళ మరోసారి అలాంటి ఘటనలు తలెత్తకుండా ప్రణాళికాయుతంగా ప్రాణవాయువును పదిలపర్చింది. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి గ్రీన్ చానెల్ ద్వారా ఆస్పత్రులకు హడావుడిగా ఆక్సిజన్ ను తెప్పించుకోవాల్సిన పరిస్థితి నుంచి.. ఆక్సిజన్ మిగులు నిల్వలు ఉంచుకునేలా.. పరిస్థితి క్రమంగా మెరుగుపడింది.

ap govt concentration on Oxygen surplus reserves

కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్న వేళ.. ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతూ వస్తోంది. గత నెలలో కేసులు తీవ్రస్థాయిలో ఉన్నప్పడు ప్రాణవాయువుకు ఏర్పడిన కొరత అందరినీ ఆందోళనకు గురిచేసింది. తిరుపతి రుయా ఘటన అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో తేరుకున్న ప్రభుత్వం ఆక్సిజన్ సమకూర్చుకునే విషయంలో గణనీయమైన పురోగతిని సాధించిందని చెప్పాలి.

గుంటూరు నుంచే ఈ ప్రక్రియకు ముందడుగు పడింది. జీజీహెచ్​లో వందల మంది రోగులకు విశాఖపట్నం నుంచి రోజూ ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్న జిల్లా యంత్రాంగం.. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్రాణవాయువు నిల్వల్ని మెరుగుపర్చింది. ఆక్సిజన్ తయారీ, నిల్వ, సరఫరా చేసే పాత ప్రైవేటు యూనిట్లను పునరుద్దరించడంతోపాటు ఇతర మార్గాలను అన్వేషించి విజయవంతమైంది.

రాష్ట్రానికి 16 రోజుల స్వల్పకాలంలోనే 2వేల మెట్రిక్‌ టన్నులకు పైగా వైద్య ఆక్సిజన్‌ను రైల్వే శాఖ సరఫరా చేసింది. దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిరంతరంగా నడిపించారు. రాష్ట్రాలకు కావాల్సిన ఆక్సిజన్‌ అవసరాలను వీలైనంత త్వరగా తీర్చడానికి రైళ్లు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరేలా.. రైల్వే శాఖ సైతం గ్రీన్‌ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్‌ రైళ్లు త్వరగా చేరేలా పర్యవేక్షణకు రైల్వేలో వివిధ విభాగాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల ద్వారా వివిధ జిల్లాలు, ఆస్పత్రులకు ప్రాణవాయువును నిరంతరంగా సరఫరా చేసింది. ఫలితంగా ఆపదకాలంలో ఆక్సిజన్ కొరతను అధిగమించగలిగారు. రాష్ట్రానికి కావాల్సిన వైద్య ఆక్సిజన్‌ అవసరాలను తీర్చడంలో రాష్ట్రప్రభుత్వం, రైల్వే శాఖల మధ్య సమన్వయం కలిసొచ్చింది. ఈ రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికార యంత్రాంగం విజయం సాధించింది. అంతిమంగా.. ఆక్సిజన్ నిల్వల మిగులు దిశగా.. అధికార యంత్రాంగం చేసిన శ్రమ.. ఫలితాన్నిచ్చింది.

ఇదీ చదవండి:

Tirumala Alipiri: అలిపిరి - తిరుమల కాలినడక మార్గం మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.