హైదరాబాద్లోని ఆంధ్రా పారిశ్రామికవేత్తలు, నేతలను కేసీఆర్ ప్రభుత్వం వేధిస్తోందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. హైదరాబాద్లోని ఒక్కో ఆంధ్రా ఫార్మా కంపెనీ.. వైకాపాకు 100 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ ఒత్తిడి చేస్తున్నారన్నారు. వైకాపాలో చేరాలని తెదేపా నేతలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. తమ ట్రాన్స్ ట్రాయ్ కార్యాలయాన్ని మెట్రో నిర్మాణంలో భాగంగా కూల్చివేసినందుకు 150 కోట్లు, గచ్చిబౌలి-శంషాబాద్ రహదారి నిర్మాణానికి మరో 150 కోట్లు.. ఇలా మొత్తం 300 కోట్ల మేరకు తెలంగాణ ప్రభుత్వం తమకు బాకీపడిందని గుర్తు చేశారు. వీటిని చెల్లించడానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. నరసరావుపేట నుంచే పార్లమెంటుకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
'కేసీఆర్ 100 కోట్లు అడిగారు' - YCP
హైదరాబాద్లోని ఒక్కో ఆంధ్రా ఫార్మా కంపెనీ.. వైకాపాకు 100 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ ఒత్తిడి చేస్తున్నారని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు.