డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వివిధ స్వచ్ఛంద సంస్థల మహిళలు, చిన్నారులు రాఖీ కట్టారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారితో రాఖీ కట్టించుకున్నారు. రాష్ట్రంలో మహిళలకు అండగా ఉంటామన్న ఆయన త్వరలోనే మహిళల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాజంలో అన్నివర్గాలకు పోలీసులు అండగా ఉంటారనీ, మహిళలు సైతం ధైర్యంగా పోలీసు స్టేషన్లకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదు చేసే వాతావరణాన్ని కల్పించామని తెలిపారు.
ఇదీ చదవండి : పిడుగురాళ్లలో భారీ జాతీయ జెండా ప్రదర్శన