అణ్వస్త్రాల కంటే ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వద్ద ఉన్న కొండవీటి ప్రాజెక్టు ప్రాంతంలో నిర్వహించిన స్వచ్ఛసేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో చెత్తా చెదారాలను తొలగించారు. రోజురోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: