గుంటూరు జిల్లా తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా వేద పరీక్ష, పండితుల సన్మానాలు జరిగాయి. 95వ పరీక్ష, పండితుల సన్మాన సభలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రికి గండపెండేరాన్ని సీఎస్ చేతుల మీదుగా బహుకరించారు. వేదం నేర్చుకున్న వేద పండుతులు కేవలం ధనార్జనకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజలకు జ్ఞానం అందించేందుకు పాటుపడాలని సీఎస్ సూచించారు. అంతే కాకుండా వేద పండితుల సభలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సమాజం ఇతరులు చేయవలసిన పనులు సున్నితంగా చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. జ్ఞాన వైరాగ్యం కలిగిన సభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండీ :